యాప్నగరం

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 2 సెకన్ల పాటు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 13 Aug 2022, 8:11 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం స్వల్పంగా భూప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలుచోట్ల భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు, ఉదయగరి, కొండాపురం, వింజమూరు, వరికుంటపాడు తదితర గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. అలాగే, ప్రకాశం జిల్లాలోని పామూరు మండలంలో సైతం 2 సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.