యాప్నగరం

Coronavirus in Vizag: ఏపీలో ఆరో కరోనా పాజిటివ్ కేసు.. తొలి స్థానిక కేసు..

Sixth Corona Positive Case in AP: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఆరుకు చేరాయి. సౌదీ నుంచి వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన మహిళకు కరోనా సోకింది.

Samayam Telugu 23 Mar 2020, 8:19 am
ఆంధ్రప్రదేశ్‌లో మరో కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య ఆరుకు చేరింది. సౌదీ అరేబియా నుంచి విశాఖపట్నం వచ్చిన రోగి సంబంధీకురాలైన మహిళ (49)కు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. దీన్ని ధ్రువీకరిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉన్న వ్యక్తికి సోకిన తొలి కరోనా పాజిటివ్ కేసుగా ఇది నిలిచింది. అలాగే ఏపీలో కరోనా సోకిన మొదటి మహిళ కూడా ఈమే కావడం గమనార్హం.
Samayam Telugu Coronavirus 1


Also Read: ఏపీ లాక్ డౌన్.. సీఎం జగన్ సంచలన ప్రకటన

ఈ సందర్భంగా విదేశాల నుంచి వచ్చేవారితో జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రజలను సూచించింది. ఇప్పటివరకు విదేశాల నుంచి ఏపీకి 13,301 మంది వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో 11,206 మంది ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది. 2,222 మందికి ఇంట్లోనే 28 రోజుల ఐసోలేషన్‌ పూర్తయిందని ప్రభుత్వం తెలిపింది. 53 మందిని ఆస్పత్రుల్లో చేర్పించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించింది.

మరో 16 మంది నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని వివరించింది. కాగా, నెల్లూరులో కరోనా సోకిన వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడని, అతడిని త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Must Read: బోర్డర్లన్నీ మూసివేత, అంతా ఇంట్లోనే.. ప్రతి ఇంటికి రూ. వెయ్యి.. సీఎం జగన్ సంచలన నిర్ణయాలు
Read Also: తెలంగాణలో 27కి చేరిన కరోనా కేసులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.