యాప్నగరం

ప్రకాశం జిల్లాలో కుల బహిష్కరణ.. ఆగిపోయిన పెళ్లి

గ్రామ కట్టుబాటును కాదని శివయ్యకు నాయుడు బ్రహ్మయ్య మద్దతు ఇచ్చారు. కులం కట్టుబాట్లు మీరినందుకు బ్రహ్మయ్య కుటుంబాన్ని కూడా బహిష్కరించారు. దీంతో ఆయన కుమారుడి పెళ్లి ఆగిపోయింది.

Samayam Telugu 4 Aug 2020, 3:59 pm
ప్రకాశం జిల్లాలో కుల బహిష్కరణలు కొనసాగుతున్నాయి. కొత్తపట్నం మండలం ఈతముక్కల పల్లెపాలెంలో కుల పెద్దలు నాయుడు బ్రహ్మయ్య అనే వ్యక్తి కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. 2019లో వివాదాస్పదమైన ఓ స్థలం విషయంలో శివయ్య అనే వ్యక్తిని కులం నుంచి కుల పెద్దలు వెలివేశారు. గ్రామ కట్టుబాటును కాదని శివయ్యకు నాయుడు బ్రహ్మయ్య మద్దతు ఇచ్చారు. కులం కట్టుబాట్లు మీరినందుకు బ్రహ్మయ్య కుటుంబాన్ని కూడా బహిష్కరించారు.
Samayam Telugu ప్రకాశం జిల్లాలో కుల బహిష్కరణ


బ్రహ్మయ్య కుటుంబాన్ని ఊరి నుంచి బహిష్కరించడంతో పాటూ అతడి కుమారుడి వివాహానికి గ్రామస్థులు ఎవరూ హాజరు కాకూడదంటూ కులపెద్దల ఆంక్షలు విధించారు. గ్రామంలో చాటింపు వేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని బ్రహ్మయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి పెద్దలను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా స్పెషల్ టీం పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.