యాప్నగరం

ఏపీ, తెలంగాణ ప్రజలకు శుభవార్త: పట్టాలెక్కనున్న మరిన్ని రైళ్లు.. వివరాలివే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మంగళవారం నుంచి మరిన్ని రైళ్లు పట్టాలెక్కనున్నాయి.

Samayam Telugu 30 Nov 2020, 8:13 pm
కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల సౌకర్యార్థం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జోన్ల వారీగా రైళ్ల సంఖ్యను ఇండియన్ రైల్వేస్ పెంచుతూ వస్తోంది. తాజాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల మధ్య మరికొన్ని రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది.
Samayam Telugu రైలు
Vijayawada to Secunderabad Trian


డిసెంబర్ 1 నుంచి లింగంపల్లి- కాకినాడ టౌన్ మధ్య ట్రై వీక్లీ రైలు నడవనుంది. లింగంపల్లిలో (సోమవారం, బుధవారం, శుక్రవారం) రాత్రి 7 గంటలకు బయల్దేరనున్న ఈ రైలు మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. అలాగే కాకినాడలో (మంగళవారం, గురువారం, ఆదివారం) రాత్రి 8 గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 7.20 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. మరోవైపు విజయవాడ- చెన్నై మధ్య నడిచే పినాకిని ఎక్స్‌ప్రెస్ కూడా డిసెంబర్ 1 నుంచి ప్రతి రోజూ పరుగులు పెట్టనుంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇక విజయవాడ- లింగంపల్లి మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (ఎంప్లాయిస్ ట్రైన్) డిసెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది.

అలాగే డిసెంబర్ 1 నుంచి సికింద్రాబాద్‌- హావ్‌డా- సికింద్రాబాద్‌ (.02702/02705), విజయవాడ- ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-విజయవాడ (02711/02712), విజయవాడ- విశాఖపట్నం-విజయవాడ (02718/02717), సికింద్రాబాద్‌- శాలిమార్‌-సికింద్రాబాద్‌ (02774/02773) రైళ్ల సమయాల్లో మార్పు ఉంటుందని వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.