యాప్నగరం

విశాఖ, విజయవాడ, గుంటూరువాసులకు అలర్ట్.. ఈ ఆరు రైళ్లు రద్దు

దక్షిణమధ్య రైల్వే ఆరు రైళ్లను రద్దు చేసింది. విశాఖ-కాకినాడ, కాకినాడ-విజయవాడల మధ్య రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరు-సికింద్రాబాద్ మధ్య రైళ్లు కూడా రద్దు చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 8 Sep 2022, 8:06 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Trains Canceled
విశాఖ, విజయవాడవాసులను రైల్వేశాఖ అలర్ట్ చేసింది. గురువారం నాలుగు రైళ్లను రద్దు చేసింది. కాకినాడ పోర్ట్-విశాఖపట్నంల మధ్య నడిచే (17267) రైలును రద్దు చేశారు. విశాఖపట్నం-కాకినాడ పోర్ట్ మధ్య నడిచే (17268) రైలు రద్దైంది. కాకినాడ పోర్ట్-విజయవాడల మధ్య నడిచే (17258) రైలు.. విజయవాడ-కాకినాడ పోర్ట్ మధ్య నడిచే (17257) రైలును కూడా క్యాన్సిల్ చేశారు. ఆపరేషనల్ కారణంగా రద్దు చేసినట్లు తెలిపారు.
అలాగే గుంటూరు-సికింద్రాబాద్ (12705), సికింద్రాబాద్- గుంటూరు (12706) రైలు కూడా రద్దైంది. నాన్ ఇంటర్ లాకింగ్ పనులు ఉండటంతో.. గురువారం నుంచి ఈ నెల 20 వరకు రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇటు నర్సాపూర్-యశ్వంత్‌పూర్ మద్య నాలుగు ప్రత్యేక రైళ్ల (07153, 07154)ను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ప్రయాణికులు ఈ మార్పులు, రైళ్ల రద్దును గమనించాలని.. తమకు సహకరించాలని అధికారులు కోరారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.