యాప్నగరం

AP Assembly: వాళ్లపై క్రిమినల్ కేసులు.. స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం

ఏపీ అసెంబ్లీ ఆవరణలో గురువారం జరిగిన ఘటనపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం. లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన బయటి వ్యక్తుల్ని గుర్తించి.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశం.

Samayam Telugu 13 Dec 2019, 11:32 am
ఏపీ అసెంబ్లీలో మార్షల్స్‌తో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగిన ఘటనపై దుమారం రేగింది. సభలో వైఎస్సార్‌సీపీ-టీడీపీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఇరు పార్టీల ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం కలగజేసుకున్నారు. బయట వ్యక్తులు టీడీపీ ర్యాలీలో పాల్గొనడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. బయటి వ్యక్తుల్ని గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. బయటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పీకర్ ఆదేశించారు.
Samayam Telugu tammineni


ఇటు మార్షల్స్‌తో చంద్రబాబు అనుచితంగా మాట్లాడారన్నది వాస్తవం అన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. బాబు అనకూడని మాట అన్నారని.. పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే గౌరవం ఉంటుందన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు తనను అసెంబ్లీ గేటు దగ్గర అవమానించారని.. దీనిపై ఎవరు విచారం వ్యక్తం చేస్తారని ప్రశ్నించారు. ముందు తనకు జరిగిన విచారం వ్యక్తం చేస్తే.. తాను విచారం వ్యక్తం చేస్తానన్నారు.

చంద్రబాబు సమాధానంపై స్పందించిన శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నిన్నటి ఘటనపై చర్యలు స్పీకర్‌దే తుది నిర్ణయమన్నారు. స్పీకర్‌కే నిర్ణయాన్ని వదిలేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై వైఎస్సార్‌సీపీ సభ్యులు కూడా ప్రసంగించారు.. చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేనని.. లేకపోతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.