యాప్నగరం

లాక్ డౌన్ వేళ.. నిండు గర్భిణి నరకయాతన

శ్రీకాకుళం జిల్లాలో నిండు గర్భిణి నరకయాతన అనుభవించింది. కొత్తూరు మండలంలోని అల్తీ పంచాయతీ దిగువరాయిగూడ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 27 Apr 2020, 4:07 pm
శ్రీకాకుళం జిల్లాలో సోమవారం హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్‌ (కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్‌తో ఓ నిండు గర్భిణి నరకయాతన అనుభవించింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని అల్తీ పంచాయతీ దిగువరాయిగూడ గ్రామానికి చెందిన సవర వాణిశ్రీ అనే మహిళకు సోమవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి.
Samayam Telugu గర్భిణిని డోలీలో తీసుకెళ్తున్న స్థానికులు


ఈ సమాచారం అందుకున్న ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దిగువరాయిగూడ నుంచి ఒడిశా సరిహద్దు వరకు ఆటోలో తీసుకొచ్చారు. అయితే రాకపోకలను అడ్డుకునేందుకు రెండు రోజుల క్రితం అల్తీ పంచాయతీకి వెళ్లే రహదారిని మిలగాం వద్ద ఒడిశా అధికారులు తవ్వేశారు.

దీంతో ఆమెను ఆటో నుంచి దింపేసి డోలి సహాయంతో మోసుకెళ్లి మిలగాం దాటించారు. అనంతరం అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో కొత్తూరు సామాజిక ఆసుపత్రిలో చేర్పించి వైద్య సహాయం అందిస్తున్నారు. అయితే డోలిలో తీసుకెళ్లే క్రమంలో ఆమె నరకయాతన అనుభవించింది. ప్రసవ వేదనతో అల్లాడిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.