యాప్నగరం

శ్రీకాళహస్తిలో కరోనా కలకలం: ఢిల్లీ వెళ్లొచ్చిన 15మంది గుర్తింపు.. రుయాకు తరలింపు

Andhra Pradesh coronavirus cases| ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లినవారిలో 15మంది శ్రీకాళహస్తిలో ఉన్నట్లు తేలింది.. వీరిని గుర్తించి వెంటనే వీరిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు.

Samayam Telugu 1 Apr 2020, 9:40 am
ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్యం హాఫ్ సెంచరీ దాటేసింది. వీరిలో ఎక్కువమంది ఢిల్లీ మర్కజ్‌ నిజాముద్దీన్‌ సమావేశాలకు వచ్చిన వాళ్లు ఉన్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మర్కజ్‌కు వెళ్లిన వారి వివరాలను ఆరా తీస్తున్న అధికారులు ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచి అధికారుల లెక్కల ప్రకారం 40మందికిపైగా ఢిల్లీ నిజాముద్దీన్‌ సదస్సుకు వెళ్లారట.
Samayam Telugu coronavirus


Read Also: ఏపీలో మరో 14 కరోనా పాజిటివ్?.. మొత్తం 58కు చేరిన కేసులు!

చిత్తూరు జిల్లా నుంచి వెళ్లిన వారిలో 28 మందిని గుర్తించారు.. వీరిని శ్రీకాళహస్తి, పీలేరు, పుంగనూరు, చిత్తూరు, కురబలకోట, పద్మావతి నిలయంలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తీసుకెళ్లారు. మిగిలిన 18 మందిలో 15 మంది ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 15మంది శ్రీకాళహస్తిలో ఉన్నట్లు తేలింది.. వీరిని గుర్తించి వెంటనే వీరిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు.

రుయా ఆస్పత్రిలో మంగళవారం ఒక్కరోజే 64 మందికి వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించారట. ఈ రిపోర్టులు బుధ, గురువారాల్లో వస్తాయని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఢిల్లీ వెళ్లిన వారు పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం పిలుపునివ్వడంతో జిల్లా వాసులు కొందరు ఎవరికి వారుగా వ్యాధి నిర్థారణ పరీక్షల కోసం రుయాకు వస్తున్నారు. అలాగే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలో ఇంటింటి సర్వే చేపడుతున్నారు అధికారులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.