యాప్నగరం

జగన్‌కు మరో షాకిచ్చిన అశ్విని కుమార్.. ఈసారి ఏకంగా ఏజీకి లేఖ

జగన్‌పై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలుకు అనుమతివ్వాలని ఆయన కోరారు. సీజేకు సీఎం జగన్‌ రాసిన లేఖను బహిర్గతం చేయడం ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే అన్నారు.

Samayam Telugu 26 Oct 2020, 11:32 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సుప్రీంకోర్టు లాయర్ అశ్వినికుమార్ ఉపాధ్యాయ షాకిచ్చారు. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌కు లేఖ రాశారు. జగన్‌పై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలుకు అనుమతివ్వాలని ఆయన కోరారు. సీజేకు సీఎం జగన్‌ రాసిన లేఖను బహిర్గతం చేయడం ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే అన్నారు. 31 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి కోర్టులు, న్యాయమూర్తులను బెదిరించేలా ప్రవర్తిస్తున్నారన్నారు. జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని సీజేకు ఫిర్యాదు చేశారు. అశ్వినకుమార్ రాసిన లేఖ ఆసక్తికరంగా మారింది.
Samayam Telugu సీఎం జగన్


ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని గతంలో అశ్విని ఉపాధ్యాయ పిల్‌ దాఖలు చేశారు. అంతేకాదు అశ్విని కుమార్ సుప్రీంకోర్టు సీజేకు కూడా కొద్దిరోజుల క్రితం లేఖ రాశారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న రాజకీయ నేతల విషయంలో జస్టిస్ ఎన్వీ రమణ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని, ప్రజాప్రతినిధులపై కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్న తీర్పుతో జగన్ ఆగ్రహంగా ఉండొచ్చన్నారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం జగన్, ఆయన సహచరులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని.. అవి కోర్టుల్లో నిరూపితమైతే జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. జగన్‌పై ఉన్న 31 కేసుల్లో తీర్పులు చెప్పే న్యాయమూర్తుల ప్రస్తుత లేఖ ప్రభావం పడే అవకాశం ఉందని.. జగన్ చర్య న్యాయవ్యవస్థపై బెదిరింపులకు దిగినట్లుగానే పరిగణించాలని అశ్విని కుమార్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.