యాప్నగరం

రండి బాబూ రండి, చూడండి జగనన్న వింత.. చెరువులు, గుట్టలు, పుట్టల్లో.. టీడీపీ షాకింగ్!

రాష్ట్రంలో చెరువులు పూడ్చి, ఎలాంటి మౌళిక వసతులు కల్పించకుండా పేద ప్రజలకు ఇచ్చిన స్థలాలు నీటిలో మునిగిపోయాయంటూ..!

Samayam Telugu 5 Sep 2021, 6:19 pm
వర్షాకాలం మొదలు కావడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. వానల జోరు వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయి. గుంతలుపడి, బురద నీరు చేరడంతో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో అధ్వానంగా తయారైన రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ ఇటీవలే ఉద్యమం చేపట్టింది. రోడ్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు.
Samayam Telugu సీఎం జగన్


అలాగే, వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జళమయం అవుతున్నాయి. అయితే, ఇటీవలే రాష్ట్రంలోని పేద ప్రజలకు జగన్ సర్కారు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో భారీగా నీళ్లు చేరాయి. పలుప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు నీటిలో మునిగిపోయాయని తెలుగు దేశం పార్టీ ఆరోపించింది. ‘‘రండి బాబూ రండి..చూడండి జగనన్న వింత.. ఇది పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో నీట మునిగిపోయిన జగనన్న కాలనీ’’ అంటూ టీడీపీ ఎద్దేవా చేసింది. ఈ మేరకు టీడీపీ వరుస ట్వీట్లు చేసింది.


‘‘రండి బాబూ రండి..చూడండి జగనన్న వింత.. ఇది దెందులూరు నియోజకవర్గంలో నీట మునిగిపోయిన జగనన్న కాలనీ.. చెరువులో ఒక అడుగు మట్టి పోసి ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇలాంటి చెరువును పేదలకు ఇంటి స్థలాలుగా ఇచ్చాడు మన ముఖ్యమంత్రి!

ఆయనకి మాత్రం పులివెందుల ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, లోటస్ పాండ్ ప్యాలెస్, యెలహంక ప్యాలెస్.. ఇన్ని కావాలి. పేదలకు మాత్రం చెరువులు, గుట్టలు, పుట్టల్లో స్థలాలా??’’ అంటూ టీడీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.