యాప్నగరం

ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు టీడీపీ రూ.లక్ష ఆర్థిక సాయం

ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచిన టీడీపీ.. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పు ఆర్థిక సాయం. చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.

Samayam Telugu 31 Oct 2019, 9:48 pm
ఏపీలో ఇసుక కొరతతో పనుల్లేక కార్మికులు చేసుకున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు చంద్రబాబు. గురువారం గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలతో సమావేశమయ్యారు. టీడీపీ తరపున రూ.లక్ష ఆర్థిక సాయాన్ని చంద్రబాబు అందజేశారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
Samayam Telugu babu.


పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోవడంతోనే ఏపీలో ఇసుక కొరత వచ్చిందన్నారు చంద్రబాబు. ఇసుక కొరతతో పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు తీసుకుంటున్నారని.. కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అంతటితో ఆగకుండా బాధితులను హేళన చేసేలా మంత్రులు మాట్లాడటం దారుణం అన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందన్నారు.

‘వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోయి గుంటూరులో ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణరంగ కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1,00,000 ఆర్ధిక సహాయం టీడీపీ తరపున అందజేయడం జరిగింది. ప్రభుత్వం ఆ కుటుంబాలకు పూర్తి న్యాయం చేసేవరకు వారి తరపున పోరాడతాం’అంటూ చంద్రబాబు కార్మికులకు భరోసా ఇస్తూ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.