యాప్నగరం

YS Jagan గారూ.. ఈ డాక్టర్‌నూ సస్పెండ్ చేస్తారా: చంద్రబాబు

YS Jagan Mohan Reddy: డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్‌ చేయడంపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

Samayam Telugu 8 Apr 2020, 7:50 pm
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం రీజినల్ ఆస్పత్రి డాక్టర్ కె. సుధాకర్‌ను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో మాస్కులు, గ్లౌజ్‌లు లేవని చెప్పారని, అయితే వీటిని సమకూర్చడం తమ బాధ్యత అనే సంగతి మరిచిపోయి సస్పెండ్ చేస్తారా అని మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు బుధవారం వరుస ట్వీట్లు చేశారు. ఎన్ 95 మాస్కులు ఇవ్వాలని కోరడమేనా డాక్టర్ సుధాకర్ చేసిన నేరమని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్య దారుణమన్నారు.
Samayam Telugu pjimage - 2020-04-08T194441.430


కరోనా వైరస్ మహమ్మారిని పారదోలడానికి ముందుండి పని చేస్తున్న డాక్టర్ల పట్ల ఇలాగేనా వ్యవహరించేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో డాక్టర్లలో ఎలా మనోస్థైర్యం నింపుతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బందిని రక్షించుకోవడం బాధ్యతని పేర్కొన్నారు.

అలాగే మాస్కులు, ఇతర పరికరాల కొరతపై ఓ జూనియర్ డాక్టర్ విడుదల చేసిన వీడియోను సైతం చంద్రబాబు రీట్వీట్ చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ జూనియర్ డాక్టర్ సైతం తన రక్షణతో పాటు, వేలాది మంది తోటి వైద్య సిబ్బంది కోసం గళమెత్తారని, ఈయన్ను కూడా సస్పెండ్ చేస్తారా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను నిలదీశారు. డాక్టర్ల పట్ల ఇలా వ్యవహరిస్తే పరిస్థితిని ఊహించుకోవడానికే భయానకంగా ఉందని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.