యాప్నగరం

YS Jagan ను మాజీ రాష్ట్రపతితో పోలుస్తూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

మాజీ రాష్ట్రపతితో పోలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు చురకలంటించారు.

Samayam Telugu 1 Jun 2020, 7:30 pm
భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డితో పోలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు చురకలంటించారు. నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సీఎం జగన్ను టార్గెట్ చూస్తూ సోమవారం చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.
Samayam Telugu చంద్రబాబు, నీలం సంజీవరెడ్డి, జగన్


‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, భారత రాష్ట్రపతిగా మరెన్నో పదవుల్లో సేవలందించిన తెలుగు వెలుగు, కీర్తిశేషులు నీలం సంజీవరెడ్డిగారి వర్ధంతి సందర్భంగా.. ఆయన జీవితంలో పాటించిన విలువల గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సంజీవరెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించి పదవినే వదిలేశారు. తాను లోక్‌సభ సభాపతిగా ఎన్నిక కాగానే, నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో.. తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి విలువలకు పట్టంకట్టారు. కాబట్టే భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మరి ఈనాడు గౌరవ పదవుల్లో ఉన్నవారు కోర్టులు ఒక సారి కాదు 65 సార్లు తప్పుపట్టినా దులిపేసుకోవడం శోచనీయం. కోర్టుల వ్యాఖ్యలనే కాదు, తీర్పులను లెక్కపెట్టని పెడ ధోరణి చూస్తున్నాం. పైగా కోర్టులకే దురుద్దేశాలు ఆపాదించే హీనానికి దిగజారడం బాధేస్తోంది. ఈ నేపథ్యంలో ‘నీలం’ లాంటి నాయకుల స్మృతులను మననం చేసుకోవాల్సిన సందర్భం ఇది.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.