యాప్నగరం

TDP: ఆ నియోజకవర్గ ఇంఛార్జ్‌ను మార్చిన టీడీపీ.. వారసుడికి కొత్తగా అవకాశం, మాజీ మంత్రిపై పోటీకి రెడీ

Polamreddy Dinesh Reddy కు కొత్తగా అవకాశం కల్పించిన టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu Naidu). నియోజకవర్గం సమీక్ష తర్వాత నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు ఇంఛార్జ్‌గా ఉన్న పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (Polamreddy Dinesh Reddy). తాజాగా ఆయన కుమారుడికి అవకాశం ఇచ్చారు. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై బరిలోకి దిగనున్న దినేష్ రెడ్డి. అలాగే బాపట్ల చంద్రగిరి నియోజకవర్గాల సమీక్షలను నిర్వహించిన అధినేత చంద్రబాబు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 1 Oct 2022, 6:06 am

ప్రధానాంశాలు:

  • నియోజకవర్గాలవారీగా చంద్రబాబు సమీక్షలు
  • తాజాగా మరికొందరు ఇంఛార్జ్‌లతో సమావేశం
  • కీలక నియోజకవర్గానికి ఇంఛార్జ్‌ను మార్చారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Chandrababu Naidu
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) నియోజకవర్గాల వారీ సమీక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఇంఛార్జ్ పులవర్తి నాని, బాపట్ల ఇఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మతో చంద్రబాబు శుక్రవారం సమావేశం అయ్యారు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా (Guntur District) నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) సమావేశం అయ్యారు. ఇటు నెల్లూరు జిల్లా (Nellore District) కోవూరు (Kovur TDP) నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
నెల్లూరు జిల్లా (Nellore District) కోవూరు (Kovur TDp) నియోజకవర్గ ఇంఛార్జ్‌గా పోలంరెడ్డి దినేష్ రెడ్డి (Polamreddy Dinesh Reddy) ఖరారు చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి (Polamreddy Srinivasulu Reddy) ఆయన తండ్రి. ఇప్పటివరకు శ్రీనివాసుల రెడ్డి ఆ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా ఉన్నారు. శ్రీనివాసుల రెడ్డితో శుక్రవారం సమావేశం అనంతరం చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. మొన్నటి వరకు శ్రీనివాసులు రెడ్డి ఇంఛార్జ్‌గా ఉంటే.. ఇప్పుడు ఆయన వారసుడు దినేష్‌ రెడ్డికి అవకాశం దక్కింది.

కొద్దిరోజులుగా టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) నియోజకవర్గాలవారీగా సమీక్షలు చేస్తున్నారు. నియోజకవర్గాలవారీగా నేతల పనితీరుపై ఆరా తీస్తున్నారు. సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడుతో పాటూ స్థానికంగా చేపడుతున్నా కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు పార్టీ నివేదికల ఆధారంగా బాగా పనిచేస్తున్న నియోజకవర్గ ఇంచార్జ్‌లు ఇంకా ఉత్సాహంతో పనిచేయాలని సూచిస్తున్నారు. కొంతమంది ఇంఛార్జ్‌లు పనితీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.

నియోజకవర్గాల్లో పనితీరు సరిగా లేని వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. వెంటనే పనితీరు మెరుగుపరుచుకోవాలని.. లేకపోతే ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు, నేతల్లో సీరియస్‌నెస్ పెరగాలని.. పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేతల పనితీరే ప్రామాణికంగా తీసుకుంటాను అంటున్నారు చంద్రబాబు. గెలుస్తారన్న నమ్మకం ఉంటనే టికెట్‌ కేటాయిస్తానని ఇప్పటికే నేతలకు స్పష్టం చేశారు.

నేతల పనితీరు మార్చుకోకపోతే నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ మార్పుపై ఆలోచన చేయాల్సి వస్తుందని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు నియోజకవర్గాల్లో కొంతమంది నేతలు ఆశించిన స్ధాయిలో పనితీరు కనబరచలేకపోతున్నారని.. వెంటనే పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా అందరు కలిసి ముందుకు సాగాలన్నారు. కచ్చితంగా స్ధానిక సమస్యలపై పోరాటాలు చేయాల్సిందేనని.. రాబోయే రోజుల్లో పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.