యాప్నగరం

ఏపీలో విద్యుత్ కొరత.. జగన్‌కు చంద్రబాబు సలహా

' పవన విద్యుత్ యూనిట్ ధర రూ.3 నుంచి రూ.4.84కే వస్తుంటే శ్రద్ధ పెట్టకుండా.. ఇప్పుడు రూ.11.68కు విద్యుత్ కొనడం దుర్మార్గపు చర్య కాదా.. మహానది కోల్ మైన్స్ లో టన్ను ధర రూ.1600 ఉంటే, సింగరేణిలో రూ.3,700కు కొనడాన్ని ఏమనాలి'

Samayam Telugu 3 Oct 2019, 11:11 pm
ఏపీని విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది.. బొగ్గు సరఫరాపై కేంద్రం, తెలంగాణ ముఖ్యమంత్రికి సీఎం జగన్ లేఖలు కూడా రాశారు. అలాగే కేంద్రం నుంచి సహకారం తీసుకుంటున్నారు.. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. త్వరలోనే అన్ని ఇబ్బందులు సమసిపోతాయంటున్నారు మంత్రులు, అధికారులు. ఈ వ్యవహారంపై టీడీపీ-వైఎస్సార్‌సీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
Samayam Telugu cbn


ట్విట్టర్‌లో స్పందించిన చంద్రబాబు.. ‘పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)పై దుష్ప్రచారం చేసి సోలార్, విండ్ పవర్ యూనిట్ ధర రూ.3 నుంచి రూ.4.84కే వస్తుంటే, శ్రద్ధ పెట్టకుండా ఇప్పుడు రూ.11.68కు విద్యుత్ కొనడం దుర్మార్గపు చర్య కాదా? మహానది కోల్ మైన్స్ లో టన్ను ధర రూ.1600 ఉంటే, సింగరేణిలో రూ.3,700కు కొనడాన్ని ఏమనాలి?’అని ప్రశ్నించారు.
‘ముందు జాగ్రత్త చర్యగా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని కనీస అవగాహన లేదు. ప్రత్యామ్నాయం చూడకుండా విద్యుత్ కొరతతో గ్రామాలను, ప్రజలను అంధకారంలోకి నెట్టి, రాష్ట్రానికి ఆర్ధిక భారం కలిగించడాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి ? ఇప్పటికైనా ప్రభుత్వం వీటి మీద దృష్టి పెడితే మంచిది’అంటూ ముఖ్యమంత్రి జగన్‌కు సలహా ఇచ్చారు చంద్రబాబు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.