యాప్నగరం

'లెక్కల్లో తేడా కొడుతోంది.. మేమూ సహకరిస్తాం.. అలా చేద్దాం'

ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రమాదం పొంచి ఉందని ముందుగానే జాగ్రత్తపడాలని సూచన. లెక్కల్లో తేడా ఉంది.. వెంటనే పరీక్షల సంఖ్య పెంచాలని కోరిన బాబు.

Samayam Telugu 29 Mar 2020, 7:19 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ నేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రమాదం పొంచి ఉందని ముందుగానే జాగ్రత్తపడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలను సత్వరం పెంచాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటివరకూ 329 పరీక్షలు మాత్రమే చేసిందని.. రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఇది చాలా తక్కువ అంటున్నారు. వైరస్ నిర్ధారణ కిట్లను భారీగా కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన 6 రకాల చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
Samayam Telugu babu.


విదేశాల నుంచి జనవరి 18 నుంచి మార్చి 23 వరకూ భారత్‌కు 15 లక్షల మంది వచ్చారని.. వారిని గుర్తించి క్వారంటైన్‌ చేయడంలో లోపాలున్నట్లు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి చెప్పారని గుర్తు చేశారు చంద్రబాబు. రాష్ట్రంలో కూడా విదేశాల నుంచి వచ్చినవారు, ఇతర యాత్రికుల వివరాలను కేంద్రం నుంచి తీసుకుని వేగంగా గుర్తిస్తే ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు.. టీడీపీ కూడా పూర్తిస్థాయి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధిత వర్గాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలకు సేవలందించేందుకు ఆర్టీజీఎస్ సేవల్ని వినియోగించుకోవాలన్నారు బాబు. పేద కుటుంబాలకు రేషన్‌ సరకులతో పాటు రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందించాలన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి ముందుండి పని చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలకు మాస్కులు, చేతి గ్లౌజులు, ఐ షీల్డ్‌ అద్దాలు, ఇతర భద్రతా కవచాలు ఇవ్వాలన్నారు. విశాఖలోని ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లో వీటిని ఉత్పత్తి చేయొచ్చని.. వేగంగా దిగుమతి చేసుకోవాలి అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.