యాప్నగరం

ఏపీ ప్రజలకు చంద్రబాబు లేఖ

ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తాజా పరిణామాలను ప్రస్తావిస్తూ లేఖ. ప్రజలపై రూ.50వేల కోట్ల భారం మోపారని, రూ.87వేల కోట్లు అప్పులు చేశారని విమర్శ.

Samayam Telugu 11 Jun 2020, 10:17 am
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని.. పాలకుల చేతగానితనం, అవినీతి, కక్ష సాధింపుతో రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల కోసం తెచ్చిన సంక్షేమ పథకాలు రద్దు చేశారు.. కరెంటు బిల్లులు, మద్యం ధరలు, ఇసుక, సిమెంటు ధరలు విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు. ప్రజలపై రూ.50వేల కోట్ల భారం మోపారని, రూ.87వేల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు తరిమేడయంతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందన్నారు చంద్రబాబు.
Samayam Telugu చంద్రబాబు లేఖ

వైఎస్సార్‌సీపీ ఏడాది పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపిస్తే టీడీపీపై కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి విధ్వంసాలకు పాల్పడుతున్నారని.. ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తున్నారని.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. బెదిరించి, ప్రలోభపరిచి లొంగదీసుకోవడమే వాళ్ల సిద్ధాంతమన్నారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ గనుల యజమానులపై రూ.2వేల కోట్ల జరిమానాలు విధించారని.. నెల్లూరులో టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు ఇళ్లు కూల్చేశారని.. పల్నాడులో భయానక వాతావరణంతో టీడీపీ కార్యకర్తల్ని ఊళ్లలోంచి తరిమేశారని విరుచుకుపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.