యాప్నగరం

Vijaya Sai Reddyకి మండలిలో ఏం పని.. గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలకు శాసనమండలిలో ఏం పని. గ్యాలరీలో కూర్చొని బెదిరిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ప్రతిపక్ష నేత యనమల.

Samayam Telugu 22 Jan 2020, 11:48 am
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి మండలి గ్యాలరీలో కూర్చుని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.. ఈ మేరకు గవర్నర్‌కు ఓ లేఖను కూడా రాశారు. శాసనమండలితో సంబంధం లేని వ్యక్తులు గ్యాలీరీల్లో కూర్చుని ఎమ్మెల్సీను బెదరిస్తున్నారన్నది టీడీపీ ప్రధాన ఆరోపణ.
Samayam Telugu visa.


మూడు రాజధానుల బిల్లుపై మండలిలో గందరగోళం సంగతి తెలిసిందే.. మంగళవారం మండలిలో హైడ్రామా నడిచింది. బిల్లును తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రయత్నించగా రూలింగ్ 71 కింద టీడీపీ నోటీస్ ఇచ్చి బ్రేకులు వేసింది. దీంతో సభలో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య రగడ నడిచింది. దాదాపు ఐదుసార్లు మండలి వాయిదా పడింది.

సాయంత్రానికి సీన్ మారింది. రూల్ 71 కింద చర్చకు టీడీపీ ఇచ్చిన నోటీసును మండలి చైర్మన్ షరీఫ్ చర్చకు అనుమతించారు. సభలో వాడీ-వేడిగా చర్చ జరిగిన తర్వాత దీనిపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో టీడీపీ పైచేయి సాధించింది. శాసనమండలిలో రూల్‌ 71పై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 13 ఓట్లు వచ్చాయి. 9 మంది తటస్థంగా ఉన్నారు. వీరిలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటేశారు. మరో ఎమ్మెల్సీ శత్రుచర్ల ఓటింగ్ సమయానికి మండలి నుంచి బయటకు వెళ్లిపోయారు. బుధవారం మండలిలో బిల్లుపై చర్చ, ఆమోదం ఏ దిశగా వెళుతుందన్నది ఉత్కంఠరేపుతోంది. త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.