యాప్నగరం

అన్న క్యాంటీన్లను మళ్లీ తెరిచే వరకు పోరాటమే: చంద్రబాబు

పేదల ఆకలి తీర్చేందుకు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం మూసివేయడాన్ని చంద్రబాబు ఖండించారు. క్యాంటీన్లు మళ్లీ తెరిపించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

Samayam Telugu 10 Aug 2019, 8:18 am
Samayam Telugu pjimage (1)

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న అరాచక విధానాలకు నిరసనగా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని టీడీపీ నిర్ణయించింది. శుక్రవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్‌బ్యురో సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి దిగాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన తొలి పొలిట్‌బ్యురో భేటీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, వైసీపీ పాలనతో తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల ప్రభావంపై చర్చించారు. దేశ సార్వభౌమాధికారాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్టికల్ 370, 35ఎ రద్దుకు టీడీపీ పార్లమెంటులో మద్దతు పలికిందని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదల ఆకలి తీర్చేందుకు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం మూసివేయడాన్ని చంద్రబాబు ఖండించారు. క్యాంటీన్లు మళ్లీ తెరిపించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని ఒప్పందాలను రద్దు చేస్తూ రాష్ట్రాన్ని వెనక్కి నడిపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. బందరు పోర్టు ఒప్పందం, నిరుద్యోగ భృతి, కాపు రిజర్వేషన్లు రద్దు చేసేశారని, పోలవరం, అమరావతి నిర్మాణం నిలిపివేశారని దుయ్యబట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.