యాప్నగరం

టీడీపీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీకి దూరం

అసెంబ్లీకి వెళ్లకూడదని టీడీపీ నిర్ణయం. శాసనమండలిలో జరిగిన పరిణామాలకు నిరసనగా నిర్ణయం తీసుకున్న టీడీపీ. నేడు చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీఎల్పీ భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ.

Samayam Telugu 23 Jan 2020, 10:02 am
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం అసెంబ్లీకి హాజరుకాకూడదని చంద్రబాబు నిర్ణయించారు. శాసనమండలిలో జరిగిన పరిణామాలపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. నిరసనగా సభా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.. అసెంబ్లీని ఎమ్మెల్యేలు బహిష్కరించారు.
Samayam Telugu tdp.


Read Also: మూడు రాజధానులు: జగన్ సర్కార్ ముందు మూడు ఆప్షన్లు.. తగ్గేది లేదన్న వైసీపీ

మరోవైపు ఇవాళ టీడీఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీతో పాటూ మండలిలో తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దౌర్జన్యం జరిగిందని ఆరోపిస్తున్న టీడీపీ.. తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో చర్చించి దిశా నిర్దేశం చేయనున్నారు.

టీడీపీ బుధవారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సభలో తమ ఎమ్మెల్యేల్ని బెదిరిస్తున్నారని.. స్పీకర్ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ముఖ్యమంత్రి కూడా స్పీకర్‌కు ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఓ లేఖను గవర్నర్‌కు పంపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.