యాప్నగరం

CM Jagan వీడియో బయటకు తీసిన టీడీపీ.. బినామీ కంపెనీల దోపిడీ కోసమేనంటూ..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఏపీలో మద్యం ధరల తగ్గింపై ఓ రేంజ్‌లో..!

Samayam Telugu 19 Dec 2021, 10:24 pm
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం భారీగా మద్యం ధరలు తగ్గించేసింది. తెలంగాణ రాష్ట్రంలో కంటే కూడా దిగువ స్థాయికి ధరలు తగ్గాయి. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల వరకు విడతల వారీగా భారీగా పెంచిన మద్యం ధరలను.. జగన్ ప్రభుత్వం ఒక్కసారి తగ్గించేసింది.
Samayam Telugu అసెంబ్లీలో సీఎం జగన్ (ఫైల్ ఫొటో)



దీనిపైనే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ జగన్ సర్కారు తీరుపై విరుచుకుపడుతోంది. ఊసరవెల్లి కూడా ఇన్ని రంగులు మార్చదంటూ టీడీపీ అధికార ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. గతంలో సీఎం జగన్ మాట్లాడిన మాటలను ట్వీట్ చేశారు.


మీ బినామీ లిక్కర్ కంపెనీల దోపిడీ కోసమే మద్యం ధరలు తగ్గించావా అని టీడీపీ ప్రశ్నించింది. నాడు మద్యం ధరల పెంపుని సమర్థిస్తూ, షాక్ కొట్టేందుకే పెంచాం, అందుకే తాగటం తగ్గించారు అని చెప్పిన జగన్ రెడ్డి.. నేడు మద్యం ధరలు ఎందుకు తగ్గించావ్ అంటూ నిలదీసింది. తాగి ఊగమని తగ్గించావా? మరి మద్య నిషేధ హామీ ఏమైంది అంటూ వరుస ప్రశ్నలు కురిపించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.