యాప్నగరం

YS Jaganకు లోకేశ్ బర్త్ డే విషెస్.. వైసీపీ కార్యకర్తలు హ్యాపీ.. రగిలిపోతున్న టీడీపీ ఫ్యాన్స్

ఏసీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Samayam Telugu 21 Dec 2019, 3:31 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఆయన సీఎంకు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘‘ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాన’’ని ఆయన ట్వీట్ చేశారు. రాజకీయంగా ప్రత్యర్థి అయినప్పటికీ.. జగన్‌కు లోకేశ్ బర్త్ డే విషెస్ చెప్పడం అందర్నీ ఆకట్టుకుంది.
Samayam Telugu lokesh jagan smile


జగన్‌ను విష్ చేస్తూ లోకేశ్ చేసిన ట్వీట్ పట్ల వైఎస్సార్సీపీ, టీడీపీ అభిమానులు స్పందించారు. ‘‘సముద్రం పాలైన వరద జలాలు, కరువుపాలైన రాయలసీమ, రాష్ట్రం నుంచి తరలిపోతున్న పెట్టుబడులు, ఏపీకి చట్ట ప్రకారం రావాల్సిన ఆస్తులు తెలంగాణకు దారాదత్తం. అందుకా పుట్టిన రోజు సంబరాలు’’ అని ఒకరు ట్వీట్ చేశారు. జగన్ పాలనలోని తప్పులను ఎత్తి చూపుతూ టీడీపీ అభిమానులు ట్వీట్లు చేశారు.

‘‘నీ ట్విట్టర్ జీవితంలో వేసిన ఉపయోగపడే మొట్టమొదటి ట్వీట్ ఇదే అన్నా సంతోషం’’ అని వైఎస్సార్సీపీ అభిమాని ఒకరు కామెంట్ చేశారు.

‘‘నీకు సంస్కారం అనిపిస్తుందేమో గాని చిన్నబాబు గారు --- మన పెద్దాయన ఒక్క మాట చెబితే రాజధానికి భూములు ఇచ్చాము. కానీ రైతులు ఆందోళనలు చేస్తుంటే మీరు కనీసం సంఘీభావం కూడా ప్రకటించలేదు’’ అని టీడీపీ అభిమాని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘మరి అమరావతి ప్రజలకు సుఖ సంతోషాలు అవసరం లేదా? మీ చదరంగం ఆటలో సమిధలయ్యారు. వారికి భరోసా ఎవరిస్తారు. రైతు తన వేలితో తన కన్ను పొడుచుకొనేట్టు చేశారు. వారి పరిస్థితి సంకటంలో పడింది. జన్మదినాన ఆయనకు మీకూ సంతోషమే, మరి అమాయక రైతులకు? నిర్ధిష్టంగా వారికి ఏమి చేయగలరు?’’ అని ఒకరు నిలదీశారు.

‘‘వెళ్ళి బొకే ఇచ్చి చెప్పక పోయవా సామి.. మిమ్మల్ని, మీ పార్టీ నమ్ముకున్న వాళ్లను సంపుతున్నోడికి పుట్టిన రోజు శుభకాంక్షలు చెప్పడం ఏంటో.. మేం పిచ్చళ్లమా...?’’ అని టీడీపీ అభిమాని ఒకరు ఆక్రోశం వెళ్లగక్కారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.