యాప్నగరం

YS Jaganపై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన టీీడీపీ. సీఎం సోమవారం అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను బఫూన్లు అంటూ వ్యాఖ్యానించడంపై ఫిర్యాదు.

Samayam Telugu 17 Dec 2019, 9:32 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సభాహక్కుల నోటీస్ ఇచ్చింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ జగన్‌పై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలను బఫూన్లు అంటూ ముఖ్యమంత్రి జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రూల్ నెంబర్ 169 కింద సీఎం జగన్‌తో పాటూ మంత్రులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు.
Samayam Telugu cm


గత శుక్రవారం కూడా టీడీపీ జగన్‌పై ప్రివిలైజ్ మోషన్ ఇచ్చింది. స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ గేటు దగ్గర.. మార్షల్స్‌తో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గొడవ విషయంలో ప్రతిపక్ష నేత అనని మాటల్ని అన్నట్లుగా వక్రీకరించారని ఆరోపించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కలిసి ఫిర్యాదును అందజేశారు. ఇప్పుడు మళ్లీ తాజాగా మరోసారి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.

సోమవారం అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటుపై సభలో చర్చ జరిగింది. ఈ చర్చ సమయంలో టీడీపీ సభను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సిగ్గు లేదంటూ విరుచుకుపడ్డారు. బఫూన్లలా టీడీపీ ఎమ్మెల్యేలు సభను అడ్డుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైనే టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.