యాప్నగరం

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్..!

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 12 Jun 2020, 3:16 pm
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలపర్రు చెక్ పోస్ట్ వద్ద తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా ధర్నా చేసేందుకు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు ప్రయత్నించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, చింతమనేని ప్రభాకర్ అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
Samayam Telugu చింతమనేని ప్రభాకర్


ఈ క్రమంలో చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖాకీల రాజ్యం నశించాలి అంటూ నినదించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు చింతమనేని ప్రభాకర్‌ను, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఈఎస్‌ఐ కుంభకోణంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి.. సోదాలు కూడా నిర్వహించారు. అచ్చెన్నాయుడును శ్రీకాకుళం నుంచి విజయవాడకు ఏసీబీ అధికారులు తరలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ కూడా రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తోంది. ఇదే సమయంలో అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.