యాప్నగరం

జగన్ ఓ గొప్ప నేత.! టీడీపీ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను టార్గెట్ చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. రైతు భరోసా, మద్యనిషేధం అమలుపై మాట్లాడారు. అందులో భాగంగానే ఆయన గొప్ప నేత అంటూ వ్యాఖ్యానించారు.

Samayam Telugu 20 Oct 2019, 8:14 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా నేటికీ పెండింగ్ బిల్లులు చెల్లించలేని చేతకాని ప్రభుత్వమంటూ ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ ఇంట్లో కూర్చుని డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. పెండింగ్ బిల్లులు అలానే ఉన్నాయని, నేటికీ ఎవరికీ బిల్లులు చెల్లించలేదన్నారు.
Samayam Telugu jagan


గోదావరిలో బోటు మునిగి నెలన్నర అయితే రాష్ట్రం మునిగి నాలుగున్నర నెలలు అవుతోందని ఉమా విమర్శలు గుప్పించారు. బోటు మునిగి ఇన్ని నెలలైతే సీఎం జగన్‌ చేతకానితనం.. అసమర్థత వల్లే ఇంకా బయటకు తీయలేకపోయారని వ్యాఖ్యానించారు. గోదావరి గర్భంలో మూడొందల అడుగుల లోతున ఉన్న కొండను తవ్వి కిలోమీటర్ మేర డయాఫ్రం వాల్ కట్టామన్నారు. చేతకాని ప్రభుత్వం బోటు బయటకు తీయలేకపోయిందని విమర్శించారు.

Also Read: గుంటూరులో ఘోరం.. ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం..

ఆప్తులను పోగొట్టుకున్న బాధితులు ప్రమాదం జరిగిన కచ్చులూరు పరిసరాలకు వెళ్లకుండా గోదావరి నదిపై 144 సెక్షన్ పెట్టిన గొప్ప నేత జగన్ అని ఉమా ఎద్దేవా చేశారు. సీఎం ఇంటి వద్ద కూడా ఎప్పుడూ నిషేధాజ్ఞ‌లు అమల్లో ఉండడం ఇక్కడే చూశామన్నారు. సీఎం రేపు ఢిల్లీ వెళ్తున్నారని, అక్కడికి వెళ్లి ఏం మాట్లాడారో ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. సీబీఐ కేసుల గురించి మాట్లాడడానికే వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.

Read Also: లేటుగా వచ్చిన తిరుమల ఎక్స్‌ప్రెస్.. ఇద్దరు స్నేహితులను పొట్టనబెట్టుకుంది..

రైతుభరోసా, మద్య నిషేధం అమలుపై దేవినేని ఉమా సంచలన ఆరోపణలు చేశారు. రాత్రి మద్యం షాపులు మూతపడిన తరువాత వైఎస్సార్సీపీ నేతలు మద్యం విక్రయాలు చేస్తున్నారన్నారు. రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బులు పడకుండానే మెసేజ్‌లు పంపుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ శాఖకు భలే మంత్రిని పెట్టారంటూ సెటైర్లు వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.