యాప్నగరం

అందుకే విశాఖలో సచివాలయం.. మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

విశాఖపట్నంలో భారీ భూ కుంభకోణం. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ.. వైసీపీ నేతలకు వేల ఎకరాల భూములు. అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని మాజీ మంత్రి సంచలన ఆరోపణలు గుప్పించారు.

Samayam Telugu 18 Dec 2019, 7:03 pm
ఆంధ్రప్రదేశ్‌కు బహుశా మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారం రేగింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు.. లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతిలో ఉండొచ్చంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే జగన్.. మూడు రాజధానుల అంశం ప్రస్తావించారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Samayam Telugu visakha


జగన్ ప్రకటన వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ.. వైసీపీ నేతలు ఆరు వేల ఎకరాల భూములు కొన్నారని ఉమా చెప్పారు.

Also Read: రాజధానిలో ‘కమ్మ’ కంటే వాళ్లే ఎక్కువ.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

విశాఖ నగర సమీపంలోని మధువాడ, భోగాపురం ఎయిర్‌పోర్టు పరిసరాల్లో వేల ఎకరాలు కొనుగోలు చేశారని.. విశాఖలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు ఉమా. ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజధానిపై ఒక్కమాట మాట్లాడని జగన్.. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు విశాఖలో సచివాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రకటించారన్నారు. ఈ ఏడు నెలల్లో భూములు పెద్దఎత్తున చేతులు మారాయని ఆయన ఆరోపించారు.

విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి ఉమా డిమాండ్ చేశారు. భూ కుంభకోణానికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలున్నాయని.. వాటన్నింటినీ సీబీఐకి అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. భోగాపురం చుట్టుపక్కల వైసీపీ నేతలు వేల ఎకరాలు కొన్నారని.. అక్కడ ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఉమా.. సీఎం జగన్‌ తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Read Also:భార్య, కోడలితో వ్యభిచారం చేయించైనా.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ లెటర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.