యాప్నగరం

‘ఆ నలుగురు చెప్పినట్లే నడుస్తున్న సీఎం జగన్’

రాష్ట్ర ప్రభుత్వం నలుగురి కనుసన్నల్లో నడుస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పోలీసు అధికారులను సీఎం జగన్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు

Samayam Telugu 10 Feb 2020, 5:55 pm
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దుష్ట చతుష్టయం కనుసన్నల్లో జగన్‌ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆరోపించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఉమా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కింది స్థాయి వైసీపీ నేతల వరకూ కియా పరిశ్రమను బెదిరిస్తున్నారని.. అందుకే ఆ సంస్థ యాజమాన్యం పొరుగు రాష్ట్రాల వైపు చూస్తోందని ఆరోపించారు.
Samayam Telugu jagan1


Also Read: ‘విశాఖలో వైసీపీ బినామీ దందా.. భూ దోపిడీ రూ. వందల కోట్లలో’

కక్షపూరిత పాలనతో రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ సీఎం జగన్‌ కుప్పకూల్చారని దేవినేని ఉమా విమర్శించారు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో రేషన్‌ కార్డులు, పింఛన్లు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అందరిపైనా దాడులు పూర్తి చేసి.. ఇప్పుడు అధికారులపై పడ్డారని ఉమా వ్యాఖ్యానించారు. ఆర్టీసీ చార్జీలను పెంచి సామాన్యుడిపై భారం వేశారని.. ఇప్పుడు విద్యుత్‌ చార్జీలను పెంచుతున్నారని మండిపడ్డారు.

Also Read: ‘పనికిమాలిన పోలీస్.. పనీపాటా లేని ఎంపీ, మధ్యలో కొబ్బరి చిప్పలు’

దుష్ట చతుష్టయం కనుసన్నల్లో పాలన
దుష్ట చతుష్టయం కనుసన్నల్లో వైఎస్ జగన్‌ నాయకత్వంలోని ప్రభుత్వ పాలన సాగుతోందని దేవినేని ఉమా ఆరోపించారు. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హోంశాఖ నడుస్తోందని ఆరోపించారు. వందల మంది పోలీసు అధికారులకు గత 8 నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారని.. అందులో భాగంగానే ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై దాడి జరుగుతోందని ఉమ ఆరోపించారు.

Also Read: తహసీల్దార్ కాళ్లు పట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.