యాప్నగరం

TDP MLC Resign: టీడీపీకి షాక్.. ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా

టీడీపీకి షాకిచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా.. రాజధాని బిల్లు మండలికి వచ్చిన రోజే ఆసక్తికర పరిణామం. డొక్కా రాజీనామాపై టీడీపీలోనూ ఆసక్తికర చర్చ

Samayam Telugu 21 Jan 2020, 12:07 pm
ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపించారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనని.. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు.. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Samayam Telugu dokka.


రాజధాని బిల్లు మండలికి వచ్చిన రోజే డొక్కా రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. అది కూడా రాజధాని తరలింపును నిరసిస్తూ.. ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పోటీచేయనని అని చెప్పడం చర్చనీయాంశమయ్యింది. టీడీపీలో కూడా మాణిక్యవరప్రసాద్ రాజీనామా హాట్‌టాపిక్ అయ్యింది. డొక్కా కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు.

మాణిక్యవరప్రసాదరావును మాజీ ఎంపీ రాయపాటి టీడీపీలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు కూడా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చి ఎమ్మెల్సీ పదవితో పాటూ విప్ బాధ్యతలు అప్పగించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు.. కానీ ప్రస్తుత హోంమంత్రి మేకతోటి సుచరిత చేతిలో ఓడిపోయారు. తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.