యాప్నగరం

YS Jagan ఎప్పటికీ మా అబ్బాయే.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు.. దివాకరుడి వ్యంగ్యం!

ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనపై దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మూడు నెలల పాలనకు 100 మార్కులు ఇచ్చిన జేసీ.. ఇప్పుడు 150 మార్చులిచ్చారు. పాలనలో జగన్ కిందా మీదా పడుతున్నారని ఎద్దేవా చేశారు.

Samayam Telugu 23 Oct 2019, 3:41 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మూడు నెలల పాలనకు నూటికి నూరు మార్కులు వేయాలని వ్యాఖ్యానించిన జేసీ.. తాజాగా జగన్ పాలనకు 100కు 150 మార్కులు ఇవ్వాలంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ జగన్ మా అబ్బాయే అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన జేసీ.. పరిపాలనలో జగన్ కిందా.. మీదా పడుతున్నారని ఎద్దేవా చేశారు.
Samayam Telugu jc diwakar


దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులపై కేసులు నమోదు చేయడం పట్ల.. జేసీ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ ఉండగా.. జగన్‌కు నా బస్సులే కనిపిస్తున్నాయన్నారు. తనకు ఉన్న బస్సుల్లో ఇప్పటి వరకు 31 బస్సులు సీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న లోటుపాట్లు ఆర్టీసీతో సహా ఏ ట్రావెల్స్‌కైనా సహజమన్నారు. అపరాధ రుసుంలను విధిస్తే సరిపోయే తప్పిదాలకు సీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని దివాకర్ రెడ్డి ప్రశ్నించారు.

దివాకర్ ట్రావెల్స్ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని.. ఇష్టం వచ్చినట్టుగా టికెట్ల రేట్లను పెంచుతున్నారనే ఆరోపణలు వచ్చాయని.. విచారణ జరపగా ఆ ఆరోపణలు నిజమేనని తేలిందని.. దీంతో అక్టోబర్ 16న దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 23 బస్సులను సీజ్ చేశామని ఆర్టీఏ అధికారులు తెలిపారు.

Read Also: రేవంత్ రెడ్డిపై కేసు.. ప్రగతి భవన్ సెక్యూరిటీ ఇంఛార్జిపై వేటు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.