యాప్నగరం

మూడు నెలలైనా అవినీతి ఆరోపణలు నిరూపించగలిగారా? లోకేష్ సవాల్

ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేయాల్సి వస్తుందోనని గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఒక్కటైనా నిరూపించారా? అంటూ మాజీ మంత్రి లోకేష్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

Samayam Telugu 4 Sep 2019, 6:43 pm
జగన్ సర్కార్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ చెబుతున్న ప్రభుత్వం ఒక్కటైనా నిరూపించిందా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అవినీతి ఆరోపణల ఎత్తుగడ అన్నారు. నవరత్నాలను అమలు చేయకుండా తప్పించుకునేందుకే గత ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
Samayam Telugu lokesh


Also Read : కోడెల కుటుంబం పారిపోయింది.. ముందు వాళ్లని ఊళ్లోకి తీసుకురా బాబూ!

పోలవరంలో అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పిందని లోకేష్ గుర్తు చేశారు. కేంద్రం చెప్తున్నా వినకుండా టెండర్లను రద్దు చేశారన్నారు. రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిందన్నారు. ప్రజా రాజధాని అమరావతి ఎడారిగా మారిపోయిందని లోకేష్ అన్నారు. రాజధానిలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.

పార్టీ నుంచి వలసలపైనా లోకేష్ మాట్లాడారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు నేతలు టీడీపీని వీడుతున్నారన్నారు. నేతలు పార్టీ మారినా కార్యకర్తలు వెళ్లలేదన్నారు. అదే టీడీపీ బలమని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై పోరాడేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు సిద్ధమవ్వాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.