యాప్నగరం

YS Jagan స్పీచ్‌లో హైలెట్ ఇదే: అది ఎప్పటికీ జరగని పని.. పాత వీడియోతో, ఓ రేంజ్‌లో..!

ఏపీ మూడు రాజధానులపై రాష్ట్రంలో ఆసక్తికరమైన చర్చనడుస్తోంది. ఈ క్రమంలో సీఎం జగన్‌పై నారా లోకేష్ సంచలన కామెంట్స్..!

Samayam Telugu 22 Nov 2021, 8:51 pm
ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మూడు రాజధానుల బిల్లులను అసెంబ్లీలో ఉపసంహరించుకుంటున్నట్లు జగన్ సర్కారు సోమవారం ఉదయం ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే, మధ్యాహ్నం 3 రాజధానుల బిల్లులను ఉపసంహరించుకుంటున్నామని, ఆ స్థానంలో కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నట్లు సీఎం జగన్ ప్రకటించి అందరికీ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.
Samayam Telugu అసెంబ్లీలో సీఎం జగన్ (ఫైల్ ఫొటో)


ఈ క్రమంలో సీఎం జగన్‌ తీరును తీవ్రంగా విమర్శిస్తూ తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అవుతుందంటూ సీఎం జగన్ ఉద్దేశించి లోకేష్‌ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని ట్విట్టర్‌లో లోకేష్‌ మండిపడ్డారు. ఈ మేరకు గతంలో సీఎం జగన్ అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నట్లు అసెంబ్లీలో చేసిన ప్రకటన వీడియోను పోస్ట్ చేశారు.

అలాగే సీఎం జగన్‌ను తుగ్లక్ 3.0గా అభివర్ణిస్తూ నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అవుతుందని.. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని దుయ్యబట్టారు. ఇళ్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి 3 రాజధానులు చేయమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్ అని లోకేష్ అన్నారు. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని అని దుయ్యబట్టారు.


‘‘తుగ్లక్ 3.0! మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేసారు. ఇళ్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానులు చెయ్యమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని.’’ అని లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.