యాప్నగరం

'జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడే ఆ అనుమానం వచ్చింది'

'వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు యువకుడుగా ఉండి రోజుకి మూడు కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేస్తుంటే, అప్పుడే అనుమానం వచ్చింది. ఇప్పుడు నా అనుమానం నిజమైంది'

Samayam Telugu 12 Nov 2019, 7:13 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా కొట్టేయడానికి జగన్ అండ్ క్విడ్ ప్రోకో కంపెనీ ప్లాన్ చేసిందని.. జగన్ పాదయాత్ర చేస్తూ ఆ సర్కారీ స్థలాల సర్వే పూర్తి చేశారంటూ ఎద్దేవా చేశారు. ఓ భూమి అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భూముల్ని అమ్మేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Samayam Telugu jagan


‘మిషన్ క్విడ్ ప్రో కో మళ్ళీ ప్రారంభమయ్యింది. జగన్ గారు యువకుడుగా ఉండి రోజుకి మూడు కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేస్తుంటే, అప్పుడే అనుమానం వచ్చింది. ఇప్పుడు నా అనుమానం నిజమైంది. పాదయాత్రలో జగన్ గారు ప్రభుత్వ స్థలాల సర్వే పూర్తి చేసారన్నమాట’అంటూ నారా లోకేష్ సెటైర్లు పేల్చారు.
‘విలువైన ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా కొట్టేయడానికి జగన్ అండ్ క్విడ్ ప్రో కో కంపెనీ స్కెచ్ వేసింది. వాలంటీర్ల పేరుతో ఒకవైపు సంవత్సరానికి రూ.4 వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ, మరోవైపు పథకాల కోసం ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తాం అంటే ఊరుకోము’అన్నారు లోకేష్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.