యాప్నగరం

'వైసీపీ రౌడీ ఎమ్మెల్యే మహిళా ఎంపీడీవోపై దాడి చేస్తారా.. ఇది రాక్షస పాలన'

Venkatachalam Mpdo| మద్యపాన నిషేధమని ఇళ్ల మధ్యే సారాదుకాణాలు తెరిచి మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మహిళా అధికారిణిపై వైకాపా రౌడీ ఎమ్మెల్యే దాడి చేసారు.

Samayam Telugu 5 Oct 2019, 2:27 pm
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తనపై దౌర్జ్యనం చేసి బెదిరించారని నెల్లూరు జిల్లా వెంకటాచలం మహిళా ఎంపీడీవో పోలీస్ స్టేషన్ ముందు అర్ధరాత్రి దీక్ష చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌‌మోహన్ రెడ్డి తమకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన అనుచరుడుకి పంచాయితీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని కోటం రెడ్డి అడిగారని.. ఆ విషయం పరిశీలిస్తానని తాను చెప్పినాఫోన్‌లో బెదిరించారన్నారు. కల్లూరిపల్లిలోని తన ఇంటికి శుక్రవారం రాత్రి మద్యం సేవించి అనుచరులతో కలిసి కోటంరెడ్డి వచ్చి దౌర్జన్యానికి దిగారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Samayam Telugu mpdo


ఇదిలా ఉంటే ఎంపీడీవో ఆరోపణలు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.‘రాక్షస పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. మహిళలపై జగన్ గారికి కక్ష దేనికో అర్థం కావట్లేదు. 45 ఏళ్లకే పెన్షన్ అని మోసం చేసారు. మద్యపాన నిషేధమని ఇళ్ల మధ్యే సారాదుకాణాలు తెరిచి మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మహిళా అధికారిణిపై వైకాపా రౌడీ ఎమ్మెల్యే దాడి చేసారు’ అని మండిపడ్డారు.
‘అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ మహిళా ఎంపిడివో సరళ గారిపై వైకాపా ఎమ్మెల్యే చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైకాపా పాలనలో మహిళా అధికారిణి బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చారు.ఇక రాష్ట్రంలో ఉన్న సామాన్య మహిళల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళన కలుగుతోంది’అన్నారు నారా లోకేష్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.