యాప్నగరం

బాబాయిని చంపిన ముద్దాయిలెవరో జగన్‌కి తెలుసు.. టీడీపీ నేత సంచలన ఆరోపణలు

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున పోలీసులను పిలిచి బాబాయిని అతికిరాతకంగా చంపిన హంతకులను పట్టుకోవాలని ఆదేశిస్తారనుకున్నాను. కానీ ఆయన సీఎం అయినా నేటికీ ముద్దాయిలను పట్టుకోలేదు. ముద్దాయిలెవరో జగన్‌కి తెలుసు. అందుకే ఆ కేసు తేలడం లేదని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు.

Samayam Telugu 1 Oct 2019, 9:33 pm
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ముద్దాయిలెవరో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు తెలుసని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. బాబాయి హత్య కేసు ముద్దాయిలను జగన్ దాస్తున్నారన్నారు. జగన్ తెలియదని ప్రమాణం చేసినా తాను ఒప్పుకోనని, ఆ ముద్దాయిలెవరో ఆయనకు కచ్చితంగా తెలుసని వర్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయిని హత్య చేస్తే హంతకులను పట్టుకోలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
Samayam Telugu vivekananda-reddy


వివేకాను దారుణంగా చంపిన హంతకులెవరో మీకు తెలియదా అని జగన్‌ ప్రశ్నించారు. ఇటీవల బదిలీ అయిన కడప ఎస్పీ అభిషేక్ మహంతికి తెలియదా ముద్దాయిలెవరో? సీబీసీఐడీ అడిషనల్ డీజీ అమిత్ గార్గ్‌కి తెలియాదా? అని నిలదీశారు. ముద్దాయిలెవరో వారికి తెలుసుకాబట్టే వారిని బదిలీ చేశారన్నారు. ఇంతమందికి తెలిసిన ముద్దాయిలను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.

Also Read: సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ షాక్!

జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున పోలీసులను పిలిచి మూడు రోజుల్లో హంతకులను పట్టుకోవాలని ఆదేశిస్తారనుకున్నానని, కానీ ఆయన సీఎం అయినా నేటికీ తేలకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వివేకా కూతురు అప్పుడు మీడియా ముందుకు వచ్చి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అన్న జగన్‌ని ఎందుకు అడగడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు.

Read Also:
కేసీఆర్‌‌, జగన్‌వి ‘మందు బాటిల్’ చర్చలే.. టీడీపీ నేత ఘాటు విమర్శలు

వివేకా కేసు ముద్దాయిలు బయటకు రావడం జగన్‌కు ఇష్టం లేదని వర్ల అన్నారు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందని, ఇప్పుడిదే జగన్ పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం సొంత బాబాయి హత్య దిక్కూమొక్కూ లేని కేసుగా మారిపోయిందన్నారు. ఈ కేసును ఇప్పటికీ సీబీఐకి ఇవ్వకుండా ఎందుకు దోబూచులాడుతున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.