యాప్నగరం

వైసీపీ ఎమ్మెల్యే మోసం చేశారు.. 420 కేసు పెట్టండి.. పోలీసులకు ఫిర్యాదు

ఎన్నికల ముందు రాజధాని మార్పు ఉండదని ఓట్లు వేయించుకొని గెలిచి ఎన్నికల తర్వాత రాజధానికి మార్పుకు మోసపూరితంగా అంగీకారం తెలిపారన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు, రైతులు, రైతు కూలీలను మోసం చేసిన ఆర్కేపై 420 కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.

Samayam Telugu 4 Aug 2020, 1:21 pm
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై స్థానికులు, టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్కేపై 420 కేసు పెట్టి విచారణ చేసి కోర్టులో కేసు ఫైల్ చేయాలని తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కోరారు. ఓటర్లను, రైతులను మోసం చేసి ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు.
Samayam Telugu వైసీపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు

2019 ఇది ఎన్నికల ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజక ప్రజలకు రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పారని.. రాజధాని మార్పు జరగదు వైఎస్ జగన్ తాడేపల్లిలో నివాసం ఏర్పరుచుకున్నారని మోసపు మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గెలిచారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన రాజధాని మార్పు విషయంలో పూర్తిగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహకరించి రాజధాని మార్పు అంగీకరించారన్నారు.

ఎన్నికల ముందు రాజధాని మార్పు ఉండదని ఓట్లు వేయించుకొని గెలిచి ఎన్నికల తర్వాత రాజధానికి మార్పుకు మోసపూరితంగా అంగీకారం తెలిపారన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు, రైతులు, రైతు కూలీలను మోసం చేసిన ఆర్కేపై 420 కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.