యాప్నగరం

ఛలో గుంటూరు జైలుకు పిలుపు.. టీడీపీ, అమరావతి జేఏసీ నేతల హౌస్ అరెస్ట్‌లు

గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతో పాటూ మిగిలిన జిల్లాల నేతలకు నోటీసులు జారీ చేశారు. ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, సీపీఐ, అమరావతి జేఏసీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Samayam Telugu 31 Oct 2020, 11:58 am
అమరావతి రైతులకు బేడీలు వేయడానికి నిరసగా అమరావతి జేఏసీ, టీడీపీ నేతలు నేడు ఛలో గుంటూరు జైలుకు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతో పాటూ మిగిలిన జిల్లాల నేతలకు నోటీసులు జారీ చేశారు. ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, సీపీఐ, అమరావతి జేఏసీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అమరావతి ప్రాంతంలో గ్రామాల్లో కూడా జేఏసీ నేల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా గృహ నిర్బంధంలో ఉన్నారు.
Samayam Telugu టీడీపీ నేతల అరెస్ట్‌లు


టీడీపీ నేతల అరెస్ట్‌లపై టీడీపీ సీనియర్ నేతలు మండిపడ్డారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం సరికాదని.. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా అని ప్రశ్నించారు.. ప్రత్యేకంగా తెచ్చారా అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని అణిచివేత అమలవుతోందని.. ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ హక్కులను హరించివేశారని.. దరఖాస్తు చేసినా నిరసనలకు అనుమతులు ఇవ్వలేదన్నారు. అక్రమ గృహ నిర్బంధాలు అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.