యాప్నగరం

జగన్ ఎంత చక్కగా చెప్పారు.. ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే భర్త

పోలవరం నిర్మాణం, కేంద్రం కాదు రాష్ట్రం ఎందుకు చేయకూడదు అని, ఎంత చక్కగా చెప్పారు జగన్ గారు అంటూ గతంలో జగన్ చేసి వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేశారు.

Samayam Telugu 4 Nov 2020, 11:40 am
ఏపీలో పోలవరం ప్రాజెక్ట్‌పై రాజకీయం వేడెక్కింది. వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేసిందని అధికార పార్టీ ఆరోపిస్తుంటే.. ప్రతిపక్షం జగన్ సర్కార్ తీరుపై మండిపడుతోంది. టీడీపీ ఒక అడుగు ముందుకు వేసి పోలవరాన్ని రాష్ట్రం ఎందుకు చేయకూడదు అంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తోంది. ప్రాజెక్ట్ విషయంలో వైఎస్సార్‌సీపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని.. ఇప్పుడు మాట మారుస్తుందంటోంది.
Samayam Telugu tdp mla adireddy bhavani husband srinivas posts ap cm ys jagan comments video on polavaram project
జగన్ ఎంత చక్కగా చెప్పారు.. ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే భర్త


తాజాగా రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్ జగన్ సర్కార్‌ను పోలవరంపై టార్గెట్ చేశారు. గతంలో జగన్ చేసి వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేశారు. పోలవరం నిర్మాణం, కేంద్రం కాదు రాష్ట్రం ఎందుకు చేయకూడదు అని, ఎంత చక్కగా చెప్పారు జగన్ గారు. చంద్రబాబు గారు చేసింది ఇదే, అందుకే పోలవరం 72% పూర్తయ్యింది.. మీకు దమ్ము ఉంటే, మిగతా 28% చేసి చూపించండి అంటూ సవాల్ విసిరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.