యాప్నగరం

టీడీపీ ఎమ్మెల్యే కొత్త రూట్.. ఐడియా అదిరింది పెద్దాయన

నియోజకవర్గ ప్రజల కోసం కొత్త రూట్ ఎంచుకున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించిన గోరంట్ల.

Samayam Telugu 2 Mar 2020, 5:25 pm
టెక్నాలజీ పెరిగిపోయింది.. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువవుతోంది.. ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా నిమిషాల వ్యవధిలోనే తెలిసిపోతోంది. టెక్నాలజీకి తగ్గట్లుగా అందరూ అప్‌డేట్ అవ్వాల్సిందే. ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయానికి వస్తే.. టెక్నాలజీ విషయంలో బాగా యాక్టివ్ అవుతున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొత్త రూట్‌ను ఎంచుకున్నారు. తన నియోజకవర్గ ప్రజల కోసం వినూత్నమైన ఆలోచన చేశారు.
Samayam Telugu tdp


బుచ్చయ్య చౌదరి 'మీ గోరంట్ల' పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా.. ఈ అప్లికేషన్ ద్వారా ప్రజల తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేసేలా దీనిని రూపొందించారు. ఈ యాప్‌ను సోషల్ మీడియా ద్వారా బుచ్చయ్య చౌదరి పరిచయం చేశారు. ఇక నియోజకవర్గంలో ఎవరైనా తమ సమస్యల్ని ఫిర్యాదు చేయొచ్చు. ఈ యాప్‌ను అందరికి సులభంగా అర్ధమయ్యేలా తెలుగులో రూపొందించారు.
పథకాలు, మంచినీరు, రోడ్డు, డ్రైనేజీ, విద్య, ఉపాధి, శాంతిభద్రతలు, వైద్య సదుపాయాలు ఇలా అంశాలవారీగా ఫిర్యాదు చేసే అవకాశం ఈ యాప్‌లో ఉంది. ఎవరైనా తమ ప్రాంతంలో సమస్యపై ఫిర్యాదు చేయానుకుంటే వారి పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్, సమస్య గురించి రాసే అవకాశం ఈ యాప్‌లో ఉంది. వాయిస్ రికార్డ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు.. అలాగే ఫిర్యాదుకు సంబంధించిన ఏవైనా డాక్యుమెంట్లు ఉంటే వాటిని అప్‌లోడ్ చేసేలా యాప్‌ను రూపొందించారు. మొత్తానికి బుచ్చయ్య చౌదరి తీసుకొచ్చిన ఈ యాప్ కాన్సెప్ట్ బావుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.