యాప్నగరం

తాపీ, సిమెంట్ బొచ్చె పట్టిన చంద్రబాబు

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు. ఇసుక ధరల పెంపు, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కొల్పోయారంటూ నినాదాలు చేశారు.

Samayam Telugu 2 Dec 2020, 10:15 am
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తాపీ, సిమెంట్ బొచ్చె పట్టారు. ఇసుక కొరత, నూతన ఇసుక విధానంపై అసెంబ్లీలో నిరసన తెలిపారు. తాపీ పనిముట్లు, బంగారం కొలిచే త్రాసుతో నిరసన ర్యాలీ చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు. ఇసుక ధరల పెంపు, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కొల్పోయారంటూ నినాదాలు చేశారు. గతంలో ఉచితంగా మారిన ఇసుక నేడు భారంగా మారిందని ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu ఏపీ అసెంబ్లీలో నిరసన


రాష్ట్రంలో ఇసుక సమస్య వల్ల 30లక్షల మంది పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు టీడీఎల్పీ నేత అచ్చెన్నాయుడు. టీడీపీ అమలు చేసిన ఉచిత ఇసుకను రద్దు చేసి కృత్రిమ కొరత సృష్టించారని.. పనుల్లేక ఆత్మహత్య చేసుకున్న భవననిర్మాణ కార్మికులవి అన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం అవినీతి విధానం అని పత్రికల్లో ప్రకటనలిచ్చి మరీ ఒప్పుకున్నారన్నారు. కొత్త విధానంపై ముఖ్యమంత్రి, మంత్రి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత మనుషులకు ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని.. ఇప్పటికైనా ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటు అసెంబ్లీలో ఇసుక సమస్యపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.