యాప్నగరం

'విజయసాయి గారూ.. ఢిల్లీ నుంచి వస్తే రెండు దోమల బ్యాట్‌లు తెచ్చుకోండి'

Vijaya Sai Reddy| 'విజయసాయిరెడ్డి ఢిల్లీ నుండి వచ్చేప్పుడు రెండు దోమల బ్యాట్లు కొని తెచ్చుకో నువ్వు , జగన్ దోమలు తొలుకోడానికి పనికొస్తాయి. మీ జగన్ ఈ సమయంలో గ్రామాల్లో అడుగుపెడితే మీకు బడిత పూజ ఖాయం'

Samayam Telugu 16 Oct 2019, 6:26 pm
వైఎస్సార్‌‌సీపీ-టీడీపీ మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు ట్విట్టర్ వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. జగన్ సర్కార్ నిర్ణయాలను టీడీపీ తప్పుబడుతుంటే.. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తున్నారు. చంద్రబాబుతో పాటూ ఆ పార్టీ నేతలపై సెటైర్లు వర్షం కురిపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ టార్గెట్ చేస్తే టీడీపీ ఊరుకుంటుందా అటు నుంచి కౌంటర్ పడుతుంది. తాజగా విజయసాయి చంద్రబాబుపై చేసిన విమర్శలపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కాస్త ఘాటుగా స్పందించారు.
Samayam Telugu vs


‘గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకుంటే జగన్ గారు గ్రామాల్లోకి వెళ్లడానికి ఎందుకు భయపడుతున్నారు? మీరు ఢిల్లీ దాటి ఎందుకు రావడం లేదు. శకుని మామ విజయసాయిరెడ్డి ఢిల్లీ నుండి వచ్చేప్పుడు రెండు దోమల బ్యాట్లు కొని తెచ్చుకో నువ్వు , జగన్ దోమలు తొలుకోడానికి పనికొస్తాయి’అంటూ కాస్త ఘాటుగా కౌంటరిచ్చారు. అలాగే ‘దోమలు,ఎలుకల నివారణకి అంత ఖర్చా అని హడావిడి చేసావ్ కదా ఇప్పుడు రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వచ్చి ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కనుక నువ్వు మీ జగన్ గ్రామాల్లో అడుగు పెడితే మీకు పండగే శకుని మామా’అంటూ ఎద్దేవా చేశారు.
‘దొంగలకు చీకటి అంటేనే ఇష్టం అని నిజాన్ని ఒప్పుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను శకుని మామా విజయసాయిరెడ్డి.. అందుకేగా నువ్వు, జగన్గారు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసారు. కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. వీలుంటే పెట్రోమాస్ లైట్ పట్టుకొని గ్రామాలకి బయలుదేరు’అంటూ చురకలంటించారు. ‘అంగన్వాడీ, ఆశా, ఉపాధి హామీ, పశు సఖులు ఇలా అనేక మంది ఉద్యోగాలు తీసేసి, మీ కార్యకర్తలకు పంచేశామన్న సంతోషంలో పండగ చేసుకుంటున్న నువ్వు , మీ జగన్ ఈ సమయంలో గ్రామాల్లో అడుగుపెడితే మీకు బడిత పూజ ఖాయం!! కాస్త జాగ్రత్త శకుని మామా’తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.