యాప్నగరం

'ఆ నలుగురు ఏపీ మంత్రుల్ని దావోస్ పంపాలి.. రూ.లక్ష కోట్లు ఖాయం' బుద్దా సెటైర్లు

'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ఎవరూ వెళ్ళలేదా. బొత్స, కొడాలి నాని, అ'నిల్, పేర్ని నాని లాంటి టీంని అక్కడకు పంపించాలి.. వారికి జగన్ సారధ్యం వహించాలి' బుద్దా సెటైర్లు

Samayam Telugu 22 Jan 2020, 1:02 pm
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతోంది. తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ సదస్సుకు హాజరయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఇక ఏపీ నుంచి ఈసారి ఎవరూ దావోస్ వెళ్లలేదు.. దీంతో టీడీపీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చారు.
Samayam Telugu ysrcp.


దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తరుపున పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారని తెలిసింది. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరూ వెళ్ళలేదా అంటూ ఏపీ తెలియనట్లు ప్రశ్నించారు. బొత్స, కొడాలి నాని, అ'నిల్, పేర్ని నాని లాంటి టీంని అక్కడకు పంపించాలని, దీనికి జగన్ గారు సారధ్యం వహించాలని డిమాండ్ చేస్తున్నాము అన్నారు.
మంత్రి బొత్స గారు వోక్స్ వ్యాగన్‌ని, కొడాలి నాని గారు సన్న బియ్యం ఇంపోర్ట్ చేసే వారితో.. అ'నిల్' గారు దబరాలో నీళ్ళు పట్టే కంపెనీలని.. పేర్ని నాని గారు బస్సులు తయారు చేసే కంపెనీలని.. జగన్ గారు అయితే లక్ష కోట్ల పెట్టుబడులని తీసుకు వస్తారు అంటూ సెటైర్లు పేల్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.