యాప్నగరం

'లోకేష్ మగాడిలా ఆధారాలు భయటపెట్టాడు.. మీరు రెడీనా'

Nara Lokesh| 'మా లోకేష్ మగాడిలా మీ దొంగ పత్రిక రాసిన వార్తలో ఉన్న తేదీల్లో ఎక్కడ ఉన్నాడో ఆధారాలు బయటపెట్టాడు. మీ దొంగ పత్రిక రాసిన వార్తకి ఆధారాలు చూపించు'

Samayam Telugu 24 Oct 2019, 1:39 pm
వైఎస్సార్‌సీపీ-టీడీపీ మధ్య ట్విట్టర్ వార్ మరింత ముదిరింది. ప్రతి రోజూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు, టీడీపీ నేతలపై ఘాటు ట్వీట్లు చేయడం.. దానికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇవ్వడం షరా మామూలుగా మారింది. తాజాగా చంద్రబాబు, నారా లోకేష్‌లపై విజయసాయి చేసిన వ్యాఖ్యలకు బుద్దా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ మంత్రి నారా లోకేష్ చిరుతిళ్లపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు
Samayam Telugu lokesh


‘విజయసాయిరెడ్డి గారు ప్రజాధనాన్ని పందికొక్కుల్లా తిని అది అరగక చిప్పకూడు తిన్న నువ్వు, మీ తుగ్లక్ ముఖ్యమంత్రా.. లోకేష్ గురించి మాట్లాడేది? నీది మనిషి పుట్టుక అయితే మీ దొంగ పత్రిక రాసిన వార్తకి ఆధారాలు చూపించు’అంటూ సవాల్ విసిరారు బుద్దా వెంకన్న.
‘ప్రతిపక్ష నేతగా జగన్‌పై ఎయిర్ పోర్ట్ లో తిన్న తిండి లోకేష్ కి అంటగడతారా? లోకేష్ మగాడిలా మీ దొంగ పత్రిక రాసిన వార్తలో ఉన్న తేదీల్లో ఎక్కడ ఉన్నాడో ఆధారాలు బయటపెట్టాడు. మీరు రెడీనా.. అయితే తేల్చుకో’అంటూ ఘాటు ట్వీట్ చేశారు.
‘బిచ్చగాళ్ల దగ్గర చిల్లర కొట్టేసే నీకు అమరావతి విలువ ఏమి తెలుస్తుంది విజయసాయిరెడ్డి గారూ.. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు కష్టపడి అమరావతికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసారు. 5 నెలల్లో మీ ముఖ్యమంత్రి జగన్ అమరావతిని ఎడారిని చేసాడు.. నీకే కనుక ధైర్యం ఉంటే అమరావతికి భూములిచ్చిన రైతుల ముందుకు వచ్చి మీ వైఎస్సార్‌సీపీ అసలు అమరావతికి అనుకూలమో, కాదో చెప్పండి చాలు... మిగిలిన విషయాలు రైతులు చూసుకుంటారు. అయ్యా విజయసాయి రెడ్డిగారూ తిరుమల ఏడు కొండల్ని సైతం మింగేయ్యాలి అని చూసిన ఘన చరిత్ర మీ మహమేత, ఆయన తనయుడు జగన్‌ది. ఇప్పుడు మీరా రాష్ట్రంలో అర్చకులు, దేవాలయాల గురించి మాట్లాడేది? బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణులకు అండగా నిలిచిన ఘనత చంద్రబాబు గారిది’అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.