యాప్నగరం

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకి టీడీపీ ఎమ్మెల్సీ మద్దతు.. విషయమిదే!

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి నేతల నుంచి మద్దతు వ్యక్తమవుతోంది. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేను టీడీపీ నేతలు కులం పేరుతో దూషించడంతో అవమానానికి గురయ్యారు. ఈ వ్యవహారంపై కేసు నమోదైంది.

Samayam Telugu 3 Sep 2019, 7:06 pm
కులవివక్షకు గురైన వైఎస్సార్సీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి పలువురు నేతలు అండగా నిలుస్తున్నారు. కుల వివక్ష వ్యాఖ్యలు చేసిన వారెవరైనా శిక్ష పడాల్సిందేనని నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా ఎమ్మెల్యే శ్రీదేవికి మద్దతుగా నిలిచారు. సమస్యలు ఉంటే ఎమ్మెల్యేతో చర్చించాలి కానీ దాడులకు దిగాలనుకోవడం తగదన్నారు.
Samayam Telugu pjimage (24)


Also Read : కులదూషణ కేసు : టీడీపీ నేత శివయ్య అరెస్టు.. పరారీలో మరో ముగ్గురు

అనంతవరంలో జరిగిన ఘటన దురదృష్టకరమని డొక్కా పేర్కొన్నారు. ఎమ్మెల్యేను అడ్డగించి దుర్భాషలాడడం కరెక్ట్ కాదన్నారు. కులవివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం తగదని, సభ్యసమాజంలో ఇంకా అలాంటి ఆలోచనలు సరికాదన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు.

Also Read : కులదూషణ : బాబును అరెస్టు చేయాలి.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డిమాండ్

దళిత మహిళా ఎమ్మెల్యేపై కులదూషణకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. ఆమె గుంటూరు రూరల్ ఎస్పీని కలిసి మాట్లాడారు. ఒక ఎమ్మెల్యేకే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే సామాన్యుల దుస్థితేంటని ప్రశ్నించారు. వినాయకుడు మైలపడతాడంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె ఖండించారు.

టీడీపీ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారంటూ పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దళిత ఎమ్మెల్యే పట్ల కులవివక్ష చూపుతూ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి శిక్ష పడేలా చూడాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.