యాప్నగరం

విజయసాయి క్షమాపణ చెప్పాలి.. లేకుంటే క్రిమినల్ చర్యలు : కనకమేడల

విజయసాయిరెడ్డి తన ఫిర్యాదును ఉపసంహరించుకుని.. బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తప్పవని హెచ్చరించిన టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.

Samayam Telugu 16 Apr 2020, 9:08 am
ఏపీలో మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ లేఖ వ్యవహారం మళ్లీ దుమారం రేపుతోంది. రమేష్ సంతకం ఫోర్జరీ చేశారనే అనుమానం ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ డీజీపీకి ఫిర్యాదు చేయడం హాట్‌టాపిక్ అయ్యింది. అంతేకాదు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, టీడీపీ నేతలపై ఆరోపణలు రావడం కలకలంరేపుతోంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై ఎంపీ కనకమేడల, వర్ల రామయ్య స్పందించారు.
Samayam Telugu ravi


తనపై విజయసాయి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రవీంద్రకుమార్. ఆయన తన ఫిర్యాదును ఉపసంహరించుకుని.. బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి విజయసాయి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. రమేష్‌కుమార్‌ కేంద్రానికి రాసిన లేఖతో తనకు, టీడీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఇటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా విజయసాయి ఫిర్యాదుపై స్పందించారు. రమేష్‌కుమార్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు విజయసాయిరెడ్డి ఆరోపించడం సరికాదన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైర్‌స్‌ను అదుపు చేయాల్సింది పోయి ఇటువంటి గిమ్మిక్కులతో ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తున్నారని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.