యాప్నగరం

‘రాష్ట్రమంతా పులివెందుల సంస్కృతి.. మంత్రులకు వార్నింగులేంటి’

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రమంతటా పులివెందుల సంస్కృతి తీసుకొస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు.

Samayam Telugu 10 Mar 2020, 11:19 pm
ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అప్రజాస్వామిక విధానాలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని టీడీపీ ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలను గతంలో ఎప్పుడూ చూడలేదని, మంత్రులకు వార్నింగ్‌ ఇచ్చిన సీఎం దేశంలోనే లేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో ఎంపీ నాని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Samayam Telugu jagan 1


Also Read: బాలకృష్ణ అమాయకుడు.. ఆయన మాటకు విలువే లేదు.. బాలయ్య మిత్రుడు బాబురావు సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల్లో గెలవకపోతే పదవులు పోతాయని మంత్రులను సీఎం జగన్ బెదిరిస్తున్నారని, ఎస్పీ స్థాయి అధికారులను సైతం వదలడం లేదని ఎంపీ నాని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని నామినేషన్‌ కూడా వేయకుండా బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

పులివెందుల సంస్కృతిని రాష్ట్రమంతా తీసుకొస్తున్నారని ఎంపీ కేశినేని నాని ఆక్షేపించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో కుంటిసాకులు చూపి ఎన్నికలు ఆపేశారని కేశినేని మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ తన స్వార్థం కోసం మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేసులకు భయపడి బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని.. కేంద్రం మెడలు వంచుతానని చెప్పి కాళ్లు పట్టుకుటున్నారని ధ్వజమెత్తారు.

Also Read: పార్టీలన్నీ కలిసినా గెలిచేది జగనే.. భయంతో వణికిపోతున్నా.. టీడీపీ నేత జేసీ సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.