యాప్నగరం

అమరావతి భూ కుంభకోణంలో సీఎం జగన్ పేరు.. కొత్త చర్చ లేవనెత్తిన మాజీ మంత్రి

YS Jagan: అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా చేర్చాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు.

Samayam Telugu 15 Sep 2020, 5:47 pm
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై దుమారం రేగుతున్న తరుణంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రకటన తర్వాతే భూములు కొన్నట్లయితే సీఎం జగన్‌ కూడా ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో చేర్చాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. ‘‘ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టడం ఏసీబి మర్చిపోయినట్లు ఉంది. అమరావతిలో జగన్ రెడ్డి గారు ఇళ్ళు కట్టింది కూడా అమరావతి ప్రకటన తరువాతే కదా! ప్రకటన వచ్చిన తరువాత కొన్నవి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే జగన్ రెడ్డి కూడా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టే. వెంటనే ఆయన పేరు కూడా కేసులో చేర్చాలి.’’ అని అయ్యన్నపాత్రుడు కొత్త చర్చ లేవనెత్తారు.
Samayam Telugu అమరావతి, సీఎం జగన్

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి భూకుంభకోణం వ్యవహారం మళ్లీ ప్రకంపనలు రేపుతోంది. అమరావతి భూ కుంభకోణంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై ప్రాథమిక నివేదికల ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. రాజధాని విషయం ముందే తెలుసుకుని ఎవరెవరు భూములు కొన్నారనే కోణంలో దర్యాప్తు జరుపుతుంది. రాజధాని ప్రకటనకు ముందే కొందరు ప్రముఖులు భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొనుగోలు చేసిన వారిలో పలువురు ప్రముఖులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మరికొందరు ఉన్నట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. కొంతమంది బినామీల పేరుతో భూముల్ని కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా తేల్చారట. వారిపై ఏసీబీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు మాజీ మంత్రులు పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్యేలలో రాజధాని పరిధిలో ఉన్నవారే అని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.