యాప్నగరం

Tirupati Bypoll: పనబాక లక్ష్మి క్లారిటీకొచ్చారా.. ఆయనతో ఏం చెప్పారంటే

తిరుపతి ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఇప్పటి వరకు కేడర్‌కు టచ్‌లోకి రాలేదనే ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

Samayam Telugu 24 Nov 2020, 9:19 am
ఏపీలో తిరుపతి ఉప ఎన్నికతో రాజకీయం వేడెక్కింది. టీడీపీ దూకుడుగా అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును ప్రకటించింది. ముందుగానే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టింది. ఇటు వైఎస్సార్‌సీపీ కొత్త స్ట్రాటజీతో దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబం కాకుండా అనూహ్యంగా డాక్టర్ గురుమూర్తిని తెరపైకి తీసుకొచ్చింది.. ఆయనకు టికెట్ ఫైనల్ చేసింది.. కాకపోతే అధికారికంగా ప్రకటించలేదు. ఇక జనసేన, బీజేపీలు పోటీపై నిర్ణయానికి రాలేదు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఇప్పటి వరకు కేడర్‌కు టచ్‌లోకి రాలేదనే ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
Samayam Telugu పనబాక-సోమిరెడ్డి


పనబాక లక్ష్మి పోటీపై సందిగ్థత ఉందనే ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పనబాక లక్ష్మితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని నివాసంలో పనబాక దంపతులను కలసి మాట్లాడారు. ఉప ఎన్నిక వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో శ్రేణులు పూర్తి స్థాయిలో ఎన్నికకు సిద్ధమయ్యాయని.. ప్రచారానికి సిద్ధం కావాలని సోమిరెడ్డి సూచించారట. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రస్తావనకు వచ్చిందట.

పనబాక కుమార్తె నిశ్చితార్థ పనుల్లో ఈ నెల 21 వరకు బిజీగా ఉన్నారట. మంచి రోజు చూసుకుని ప్రచారం ప్రారంభిస్తారని సోమిరెడ్డి ట్విట్టర్‌లో తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా ముఖ్య నేతలతో కలిసి బుధవారం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. పార్టీ అభ్యర్థిగా పనబాక పేరును ప్రకటించినా.. ఎలాంటి స్పందన లేకపోవడం.. సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో.. తాజా భేటీతో స్పష్టత వచ్చినట్లయింది. రెండు సార్లు కేంద్రమంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన సీనియర్ నాయకురాలు.. వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విఫలమయ్యాయి.. అధికార పార్టీ అరాచకాలతో విసిగి వేసారిన ప్రజానీకం టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని సోమిరెడ్డి ట్వీట్ చేశారు.
పనబాక పేరును ప్రకటించిన తర్వాత ఆమె మీడియా ముందుకు రాలేదు.. టికెట్ రావడంపై స్పందనను తెలియజేయలేదు. సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పోటీ నుంచి తప్పుకున్నారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చారు. సోషల్ మీడియాలో కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలను కూడా ప్రస్తావించారు. ఆమె టీడీపీ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని.. అందుకే మౌనంగా ఉన్నారని ట్వీట్లు చేశారు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఆమె బీజేపీలోకి వెళతారని ప్రచారం చేశారు. సోమిరెడ్డి భేటీ కావడంతో దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.