యాప్నగరం

CM Jagan కు వర్ల రామయ్య రిక్వెస్ట్.. అందర్నీ పీకేయండి సార్

దళిత హోంమంత్రి సుచరితని మంత్రి పదవి నుంచి తొలగించడం సరికాదేమోనని టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య అన్నారు. మంత్రి కొడాలి నాని కొనసాగించకుండా.. అందరీని పీకేయండి సార్ అంటూ రిక్వెస్ చేశారు.

Samayam Telugu 10 Apr 2022, 1:52 pm
ఏపీలో మంత్రవర్గ విస్తరణపై అందరిలోనూ టెన్షన్ నెలకొంది. పాతవారిలో ఎవరుంటారు..? కొత్తవారిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లో లిస్ట్ రిలీజ్ అవుతుండగా.. ఇప్పటికే పలువురి పేర్లు ఖరారు అయ్యాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణపై టీడీపీ నేత వర్గ రామయ్య స్పందించారు.
Samayam Telugu వర్ల రామయ్య


నోరులేని దళిత హోంమంత్రి సుచరితని తొలగించి.. బూతుల మంత్రి కొడాలి నానిని కొనసాగించాలని చూడడం మంచిది కాదేమోనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించాలని సూచించారు. అన్న మాట మీద నిలబడి అందర్నీ పీకేయండి సార్ అని కోరారు. మాట తప్పకండి.. మడెం కూడా తిప్పకండి.. ఎవరి సలహాలు వినకండి అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.


పాత మంత్రులలో పది మందికి చోటు దక్కే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పదిమందిలో మేకతోటి సుచరితకు దక్కలేదని సమాచారం. కొడాలి నాని మరోసారి మంత్రి పదవి చేపట్టడం ఖాయమని వైఎస్సార్సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్ల రామయ్య సైటిరికల్ కామెంట్స్ చేశారు. హోంమంత్రి సుచరితని తొలగించి.. కొడాలి నాని కొనసాగించడం మంచి కాదేమోనని అనుమానం వ్యక్తంచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.