యాప్నగరం

టీడీపీ సంచలన నిర్ణయం.. మూడు రోజుల పాటూ

టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సారి కాస్త వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది.

Samayam Telugu 28 Dec 2020, 6:56 am
ఏపీలో రైతులకు సంబంధించి టీడీపీ కీలక ముందడగు వేసింది.‘రైతు కోసం’ పేరుతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనుంది. సోమ, మంగళ, బుధవారాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో పార్టీ నేతల, కేడర్ పాల్గొని రైతులు, రైతు కూలీలు, మహిళా రైతులు, కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు. మద్దతు ధర లేదు, పెట్టుబడులు కోల్పోయి, అప్పులపాలైన రైతుల సమస్యలు, పంటల బీమా సకాలంలో చెల్లించకపోవడంతో నష్టం, ఏడు వరస విపత్తుల్లో పైసా పరిహారం అందించకపోవడం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వంటి చర్యలకు వ్యతిరకంగా రైతు కోసం నిర్వహిస్తున్నారు.
Samayam Telugu టీడీపీ


రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ నేతలు సోమవారం వెళ్లి పరామర్శిస్తారు. పార్టీ తరఫున భరోసా ఇవ్వడంతోపాటు మనోధైర్యం కల్పిస్తారు. చనిపోయిన రైతుల జ్ఞాపకాలను (ముల్లుగర్ర, పైపంచె, కండువా, చెప్పులు) సేకరిస్తారు. మంగళవారం రోజు రైతులు, రైతు కూలీల సమస్యలపై ప్రతి నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహిస్తారు. రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారు.

బుధవారం రోజు టీడీపీ నేతలు, కేడర్ రెవెన్యూ, వ్యవసాయాధికారుల కార్యాలయాలకు పాదయాత్రలు చేస్తారు. నియోజకవర్గాల్లో రైతులకు వాటిల్లిన నష్టంపై వినతిపత్రాలు ఇస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల నుంచి సేకరించిన జ్ఞాపకాలను అధికారులకు అందిస్తారు. రైతు సమస్యలపై పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.