యాప్నగరం

‘‘రావాలి జగన్.. కావాలి జగన్..’’ TDP అఫీషియల్ ట్వీట్‌లో.. బాబోయ్, ఇదెక్కడి ట్విస్ట్..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్..!

Samayam Telugu 6 Dec 2021, 10:14 am
‘‘రావాలి జగన్.. కావాలి జగన్.. మన జగన్..’’ 2019 ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను ఊపేసిన పాట! యూట్యూబ్‌లో రికార్డులను బద్ధలు కొట్టేసిన సాంగ్! అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార సభల్లో మార్మోగిన పాట..! ఒక పొలిటికల్ సాంగ్ ఆ స్థాయిలో హిట్ కావడం చాలా అరుదు. కానీ, జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు మరింత చేరువ చేసి, వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపింది ఈ పాట!
Samayam Telugu రావాలి జగన్, కావాలి జగన్ చిత్రం (ఫైల్ ఫొటో)


అలాంటి పాటను ఇప్పుడు ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ జోరుగా వాడుతోంది. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆరోజుల్లో హోరెత్తిన ఈ పాటను.. ఇప్పుడు టీడీపీ ట్రోలింగ్‌ కోసం ఉపయోగిస్తోంది. వైసీపీ వైఫల్యాలకు కౌంటర్‌గా, ఆ పార్టీ నేతలపై సెటైర్లు వేసేందుకు వాడుతోంది. తాజాగా, తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్‌పై సెటైర్లు వేస్తూ ‘రావాలి జగన్.. కావాలి జగన్’ పాట పెట్టి ట్రోలింగ్ చేసింది. ఈ మేరకు టీడీపీ అధికార ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.


‘‘అసెంబ్లీలో ఉత్త వెకిలి నవ్వులే అనుకున్నాం.. అబ్బో! పార్కుల్లో బెంచీల్లాంటి నిర్మాణాలు కూడా చేయిస్తున్నారే! తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ భారీ ప్రాజెక్టు చూశాక.. సారు తన రేంజ్ కి ఏమాత్రం తగ్గట్లేదనిపిస్తోంది కదా!’’ అంటూ టీడీపీ ట్రోలింగ్ చేసింది. ఈ పోస్ట్‌కు ‘‘రావాలి జగన్.. కావాలి జగన్.. మన జగన్..’’ అనే పాటను జోడించి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.